వినాయక సాగర్ లో నిమర్జనానికి జరుగుతున్న అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు వినాయక సాగర్ లో జరుగుతున్న ఏర్పాట్లను పోలీస్ నగరపాలక సంస్థ తుడా అధికారులతో కమిషనర్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వినాయక సాగర్ లో విగ్రహాల నిమర్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనం చేసేందుకు వీలుంటుంది అని చెప్పారు.