కోటబొమ్మాళి మండలం నిమ్మడ క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గ్రీవెన్స్కు వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. వారి నుంచి నేరుగా సమస్యలను తెలుసుకొని, వ్యక్తిగతంగా అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల నుంచి వచ్చిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించారు. అర్జీలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.