నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రెండవ మహాసభలను శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా నూతన జిల్లా కమిటీని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సురేష్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలుగా గంగామణి ఉపాధ్యక్షులుగా రాధా అనూష కవిత ప్రధాన కార్యదర్శిగా గంగాధర్, సహాయ కార్యదర్శిగా అమృత, అక్షర, పెద్దన్న, లక్ష్మి, కోశాధికారిగా నవనీత ఎన్నికయ్యారు. బీడీ కార్మికులకు చేయూత పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెలా ఇస్తామన్న రూ. 4016 పింఛన్ హామీ అమలు చేయాలని కోరారు. పీఎఫ్ ఉన్నా బీడీ కార్మికులందరికీ పింఛన్ ఇవ్వాలని డిమాండ్