రైతులు యూరియా కొరత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మంగళవారం ఆయన తిరువూరు పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. రైతులందరికీ యూరియా అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. అనంతరం రైతులకు నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మాధురి కూడా పాల్గొన్నారు.