గత రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దుద్దుకూరు గ్రామంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్థానిక ఎస్సీ కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షం నీరు వెళ్లే మార్గం లేక రోడ్లన్నీ నిండిపోయి ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. దీంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని కోరుతున్నారు, లేకపోతే విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.