శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు బేరిపల్లి కాలనీలో సోమవారం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి పెన్షన్ నగదును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల 1వ తేదీని పెన్షన్ను నేరుగా లబ్ధిదారులకు అందజేస్తుందని తెలియజేశారు.