పల్నాడు జిల్లా చిలకలూరిపేట లోని షరాఫ్ బజార్ గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో 50 లక్షల విలువైన అమెరికన్ డైమండ్స్ తో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లుగా స్థానికులు గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పేర్కొన్నారు. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి తంజావూర్ నుంచి శిల్పులు కోల్కతా నుంచి పెయింటర్లు వచ్చి పది రోజులు శ్రమించారు. 15 మంది కళాకారులు ఈ విగ్రహం తయారీలో పాల్గొన్నారు. శోభాయాత్రలో 20 అడుగుల ఎత్తైన లక్ష్మీ నరసింహ స్వామి ఊరేగింపు కూడా ఉంటుందని నిర్వాహకులు రత్నబాబు తెలిపారు.