ఈ నెల 13వ తేదీన శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించ నున్నట్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్ పర్సన్, న్యాయమూర్తి పీ నీరజ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆద్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో ఉదయం 10.30 గంటల నుంచి జాతీయ లోక్ అదాలత్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కక్షిదారులు వారి యొక్క సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్ పర్సన్, న్యాయమూర్తి పీ నీరజ పిలుపు నిచ్చారు.