మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం చెవుటూరు పిఎసిఎస్ లో ఎరువుల పంపిణీలు అక్రమాలు జరగలేదని చైర్మన్ ఈమని మురళీకృష్ణ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన పిఎసిఎస్ లో మీడియాతో మాట్లాడారు. ఎరువుల పంపిణీలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఎరువులు పక్కదారి పడుతున్నాయని కొందరు సోషల్ మీడియాలో చెడు ప్రచారం చేస్తున్నారని అటువంటి వారిపై చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. చెడు ప్రచారం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.