గుత్తి, గుత్తి మండల వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లారు జాము వరకు భారీ వర్షం కురిసింది. 23.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్రతరాయం తలెత్తింది. భారీ వర్షం కురవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.