నల్లగొండ పట్టణంలోని మూడవ వార్డు శేషమ్మ గుడం పరిధిలో ఉన్న ఎస్టీ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ఆదివారం అన్నారు. ఆదివారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల సర్వేలో భాగంగా మూడోవ వార్డు ఎస్టి కాలనీలో సర్వేను నిర్వహించారు. ఈ ప్రాంతంలో అత్యధికలు ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన తరగతులు ప్రజల నివసిస్తున్నారని వారికి కావలసిన మౌలిక సదుపాయాలు మంచినీరు రావడంలేదని, అందుకోసం గతంలో అధికారులను కలిసిన సందర్భంలో పైప్ లైన్ వేశారు కానీ ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇవ్వలేదన్నారు.