ప్రకాశం జిల్లా దర్శి మండలం తిమ్మాయపాలెం లో వైసిపి ప్రకాశం జిల్లా అధ్యక్షులు మరియు స్థానిక ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పర్యటించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు పార్టీ నాయకులను పరామర్శించారు. ఎవరు ధైర్యపడవద్దని అండగా ఉంటామని వారికి భరోసా కల్పించినట్లు తెలిపారు. ఎలాంటి సహాయం కావాలన్నా నేరుగా తమకు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.