శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో బుధవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. సత్యమ్మ దేవాలయం వద్ద పెద్ద ఎత్తున నీరు చేరింది. ఉరుములు మెరుపులకు జనం ఇబ్బందులకు గురయ్యారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజల అవస్థలు పడ్డారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్న జనానికి ఉపశమనం లభించింది.