రైలులో ప్రయాణిస్తూ గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతిచెందిన ఘటన గన్నవరం రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. మృతుడు 40 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగి ఉంటాడని ఐదు అడుగుల ఎత్తు గుండ్రటి మొహం కలిగి ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే హెచ్ సి శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఏలూరు సర్వేజనాస్పత్రి కి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు