ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మార్కెట్ యార్డులో నందిపేట్ మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి మంగళవారం మధ్యాహ్నం 1:40 కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. ముందుగా మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే నందిపేట్ లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మైపాల్ వైయస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు.