ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. మృతి చెందిన వారిని కుటుంబానికి 50వేల రూపాయలు చొప్పున సహాయం అందిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం అనుమతిస్తే నియోజకవర్గ పరిధిలోని ఆరు మండులాలలో ప్రభుత్వ భూమిలో ఈత నేర్చుకోవడానికి ఎంపీ నిధులు సొంత నిధులతో స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తామన్నారు.