Parvathipuram, Parvathipuram Manyam | Aug 22, 2025
నిర్దేశించిన సమయానికి పిల్లలకు షెడ్యూల్ ప్రకారం వ్యాధినిరోదక టీకాలు వేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు స్పష్టం చేశారు. వైద్యాధికారులు,ఆరోగ్య పర్యవేక్షకులకు టీకా కార్యక్రమం,సర్వలెన్స్ పై జిల్లా స్థాయి కార్యశాల(వర్క్ షాప్) శుక్రవారం స్థానిక ఎన్జీఓ హోం లో నిర్వహించారు. డబ్ల్యూహెచ్ఓ సర్వలెన్స్ అధికారి జాన్ జూడ్ జాషువా పవర ప్రజంటేషన్ ద్వారా ఇమ్యూనైజేషన్ పై రీఓరియoటేషన్ కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ పోలియో,హెపటైటిస్,క్షయ,కోరింత దగ్గు,న్యూమోనియా,కంఠసర్పీ,తట్టు,అతిసారం,దిఫ్తీరియ,ధనుర్వాతం తదితర వ్యాధులపై దృష్టి సారించాలన్నారు.