ఈ నెల 30, 31 తేదీలలో గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర కాన్ఫరెన్స్ జరుగుతుందని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది శాంత కుమార్ తెలిపారు. సోమవారం సాయంత్రం నగరంలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాంత కుమార్ మాట్లాడారు. ఈ సదస్సుకు పలువురు జడ్జిలు, న్యాయవాదులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు చెప్పారు. సదస్సులో న్యాయవాదులకు ఉచిత భీమా కార్డులు, జూనియర్ న్యాయవాదులకు నెలకు 10 వేల రూపాయలు ఐదు సంవత్సరాలు స్టయిఫండ్, ఇండ్ల స్థలాలు పలు సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు.