నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వర్గ కొనసాగుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు ఓ ప్రకటనలో గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.80 అడుగుల వద్ద నీరు ఉంది. అధికారులు ప్రాజెక్టు పన్నెండు గేట్లను ఐదు అడుగుల 15 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 2,00, 885 క్యూసెక్కులు , ఔట్ ఫ్లో 3,44,913 క్యూసెక్కులుగా ఉందన్నారు. జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు తెలిపారు.