చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఎగువ ఎద్దులవారిపల్లి దళితవాడకు చెందిన సంధ్య (24) సం అమర రాజా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఆమె 6వ తేదీ నాడు నైట్ డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. భర్త హేమచంద్ర కుటుంబ సభ్యులు, బంధువులు వెతికినా జాడ దొరకలేదు. మంగళవారం (9వ తేదీ) భర్త ఫిర్యాదు మేరకు బంగారుపాళ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంధ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం తెలిసినవారు బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు (9440796736) ను సంప్రదించవలసిందిగా కోరారు