ఫ్రైడే డ్రై డే దోమల నివారణకు మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ పురపాలక సంఘ పరిధిలోని 20వ వార్డులో ఫ్రైడే డ్రై డే సందర్భంగా మున్సిపల్ కమిషనర్ టి. మోహన్ ఆధ్వర్యంలో ప్రజల ఇంటింటికి వెళ్లి, నిల్వ ఉన్న నీటి కుండీలను ఖాళీ చేయించి, బోర్ల పెట్టించారు. ఇంటి ఆవరణలో నీరు నిల్వ ఉంటే దోమల లార్వా తయారై వ్యాప్తి చెందుతుందని, అందువల్ల నీటి నిల్వలను తొలగించాలని కమిషనర్ సూచించారు. వార్డులలో తిరిగినప్పుడు నీరు నిల్వ ఉన్న కుండీలలో లార్వా వ్యాప్తి చెందుతున్నట్లు గమనించినట్లు ఆయన తెలిపారు.