*ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలను నిర్వహించుకోవాలి* టూ టౌన్ సీఐ నాగార్జున రెడ్డి శ్రీకాళహస్తి: వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని శ్రీకాళహస్తి రెండవ పట్టణ సీఐ నాగార్జునరెడ్డి అన్నారు. శనివారం ఆయన వినాయక కమిటీ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. గణపతి మండపాలకు విద్యుత్ తీగలను ఎవరూ అనవసరంగా ముట్టుకోకుండా చూసుకోవాలన్నారు. కవర్ లేని హాలోజన్, లాంపులను వాడవదన్నారు. రాత్రి సమయంలో ముగ్గురు వాలంటీర్లు మండపంలో నిద్రించాలన్నారు. ఇక మండలపాల వద్ద పందులు, కుక్కలు రాకుండా స్టేజీ కింద ఖాళీ స్థలంలో చెక్కతో మూసి ఉంచాలన్నారు.