జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నిర్మల్ పట్టణంలోని పలు వరద ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం పరిశీలించారు. శాంతినగర్ చౌరస్తా, సోఫీనగర్, తిరుమల టాకీస్ పరిసరాల్లో పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్, స్థానికులతో మాట్లాడారు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని, అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నారని తెలిపారు. వర్షాల కారణంగా ఇబ్బందులు తలెత్తితే వెంటనే కలెక్టర్ కంట్రోల్ రూమ్ మొబైల్ నంబర్ 9100577132 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, తహసీల్దార్ రాజు, తదితరుల