నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఅర్ఎస్) కార్యక్రమాన్ని అనివార్య కారణాల వల్ల తాత్కాలికంగా రద్దు చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి అర్జీదారులు వ్యయప్రయాసలతో రాకుండా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించనున్నట్లు తెలిపారు