కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు - బైకు ఢీకొన్నాయి. కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. బైకు రోడ్డు పక్కకు ఎగిరిపడింది. కారు, బైకు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.