ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పొలాస, శాస్త్రవేత్తల బృందం జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన పత్తి, మొక్కజొన్న, వరి పంటలను సందర్శించారు. అధిక వర్షాల వల్ల గోదావరి తీరప్రాంతంలో పత్తి, కంది పంటలు గోదావరి బ్యాక్ వాటర్ వల్ల మూడు నుంచి నాలుగు రోజులు పూర్తిస్థాయిలో నీటిలో మునిగి, 150 నుంచి 180 ఎకరాల్లో పంటలు ముంపుకు గురై నష్టపోయాయని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పొలాస, శాస్త్రవేత్తల బృందం ఒక ప్రకటనలో వెల్లడించింది.ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు స్పందన, భట్, పి. రవి ఎన్. సుమలత....