మార్క్ ఫెడ్ ద్వారా క్వింటాల్ రూ. 1200 లకు రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేస్తుందని, అందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం 12 గంటలు మార్కెటింగ్, హార్టికల్చర్, మార్క్ ఫెడ్, మార్కెట్ యార్డ్ సెక్రెటరీ తదితరులతో ఉల్లి కొనుగోలు అంశం పై జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు నుండి మార్క్ ఫెడ్ ద్వారా మార్కెట్ యార్డ్ లో ఉల్లి కొనుగోలు ప్రారంభించాలని మార్క్ ఫెడ్ అధికారులను ఆదేశించారు.