కౌతాళం:ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం వద్ద ఈనెల 23 న జరిగిన ఘర్షణ ఘటనపై ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి పూర్తి వివరాలు తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుత స్థానిక బ్యాంకు అవుట్ సోర్సింగ్ సిబ్బంది వీఐపీ దర్శనం చేయించాలంటూ ఆలయ సిబ్బందితో గొడవకు దిగారన్నారు. ఈ విషయంపై బ్యాంక్ అధికారులు క్షమాపణ కోరారని వెల్లడించారు. భక్తులపై ఎలాంటి దాడీ జరగలేదని తెలిపారు. భక్తులు తమ దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకుని వచ్చిన వాటిని వెంటనే పరిష్కరిస్తున్నట్లు ఆమె తెలిపారు.