కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ లోని అలుగునూర్ ఈనాడు పేపర్ యూనిట్ ఆఫీసు యూటర్న్ వద్ద ఆదివారం సాయంత్రం 6గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారము.. ఆదివారం సాయంత్రం మానేరు జలాశయం మిని బీచ్ కు కరీంనగర్ వైపు నుండి వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో రెండు బైకుల పై ఉన్న ఇద్దరికి గాయాలు అయ్యాయి. రెండు ద్విచక్ర వాహనలు ద్వంసం అయ్యాయి. అయితే స్థానికులు సంఘటన స్థలానికి వెళ్లి ఇద్దరికి ప్రథమ చికిత్స అందించారు. అక్కడ నుండి ఇద్దరిని కరీంనగర్ పట్టణంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.