కూకట్పల్లిలోని రంగధాముని చెరువు వద్ద వినాయక నిమజ్జనానికి గణనాథుడు తరలి వస్తుండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వై జంక్షన్ నుంచి కూకట్పల్లి వైపు, కూకట్పల్లి నుంచి బాలానగర్ వైపు ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో క్లియర్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ఇటువైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయదారుల్లో వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.