జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన వెంకటేష్ – హారిత దంపతులు కట్నం వివాదంతో ఎన్నాళ్లుగానో వేరు జీవితం గడుపుతున్నారు.అలాగే జగిత్యాల పట్టణానికి చెందిన ముస్తఫా – షిరిన్ సుల్తానా దంపతులు వరకట్నం, మెయింటెనెన్స్ కేసుల తిప్పలు ఎదుర్కొంటూ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కానీ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన లోక్ అదాలత్లో కొత్త మలుపు తిరిగింది. జిల్లా జడ్జి, ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి సమక్షంలో ఇరువురు జంటలు రాజీ చేసుకుని మళ్లీ ఒక్కటయ్యారు. ఒక క్షణం కోర్టు హాలు కన్నీళ్లు, క్షమాపణలు, హర్షధ్వనులతో నిండిపోయింది.తరువాత వెంకటేష్ – హారిత, ముస్తఫా – షిరిన్ సుల్తానా దంపతుల