ఏలూరు జిల్లా.నూజివీడు త్రిబుల్ ఐటీ లో ప్రొఫెసర్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు విద్యార్థి వినయ్ పురుషోత్తం వినయ్ సక్రమంగా క్లాసులకు హాజరు కాకపోవటంతో ల్యాబ్ ఎగ్జామ్ కి ప్రొఫెసర్ ఎస్ ఎస్ వి గోపాల్ రాజు అనుమతించలేదు.ఫస్ట్ ఇయర్ ఎమ్ టెక్ చదువుతున్న వినయ్ ఎగ్జామ్ రాయాలంటే హెచ్ ఓడి పర్మిషన్ తీసుకోవాలని ప్రొఫెసర్ గోపాలరాజు సూచించారు. దీంతో రెండు కత్తులతో ప్రొఫెసర్ పై వినయ్ దాడికి పాల్పడ్డాడు. గాయాలుపాలైన ఫ్రొఫెసర్ ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..