ఏటూరునాగారం మండలం కొండాయి, మల్యాల, గోవిందరాజు కాలనీ, ఐలాపురం గ్రామాలు రెండు నెలలుగా జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి. దొడ్ల వద్ద జంపన్నవాగు ఉధృతి కారణంగా రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా రెండు నెలలు గడుస్తున్నప్పటికీ వాగు తగ్గుముఖం పట్టడకపోవడంతో బోటు ద్వారా రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం బోటు ద్వారా గ్రామస్తులు వాగు దాటి తమ గ్రామాలకు చేరుకుంటున్నారు.