అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని ఆత్మకూరు మండలం వడ్డీపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో శివకుమార్ విజయకుమార్ అనే ఇద్దరు గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.