శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని బొగాబంద గ్రామం చెరువు వద్ద సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు ఐదు మేకలు మరణించాయి. సందూరు గ్రామానికి చెందిన దాసరి దాలయ్య అనే గొర్రెల కాపరి మేకలను మేపుతుండగా... ఒక్కసారిగా మేఘావృతమై పిడుగులు వర్షం పడింది. పిడుగుపడిన సమయంలో కాపరులు ఉన్నప్పటికీ ప్రాణాపాయ స్థితి నుండి బయట పడ్డారు. గొర్రెలే జీవన ఆధారంగా బతుకుతున్న మాకు ప్రభుత్వం సహాయం అందించాలని గొర్రెల కాపరి వేడుకున్నారు.