రైతులకు అన్ని విధాలుగా మోసం చేస్తూ రైతుల రక్తం తాగుతున్న వ్యక్తిగా సీఎం రేవంత్ రెడ్డి నిలిచిపోయాడని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ద్వజమెత్తారు. పెద్ద శంకరంపేట లో శనివారం నిర్వహించిన భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు రైతుబంధు, సాగునీరు, ఉచిత విద్యుత్ సరఫరా నిలిపివేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మాజీ సీఎం కెసిఆర్ రైతులను ఆదుకుంటే, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి రైతులను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు.