విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న 127 వ వార్డు సచివాలయం ఎడ్యుకేషనల్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ ను సస్పెండ్ చేసినట్లు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. పరివేక్షణ లోపంపై నోడల్ అధికారి, అడ్మిన్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. సదరం సర్టిఫికెట్లను పాత సర్టిఫికెట్లపై ప్రింట్ చేసి ఎడ్యుకేషనల్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ ఇచ్చినట్లు కమిషనర్ తెలిపారు. ఇప్పటికే వార్డు సచివాలయ పాత సర్టిఫికెట్లను జిఎంసి కి సరెండర్ చేయాలని నేమ్ బోర్డు లను మార్చాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.