జిల్లాలోని కొవ్వూరు వైఎస్ రెడ్డి మాల్ సమీపంలో ఒక ప్రైవేటు బిల్డింగ్ పై గుర్తుతెలియని పురుషుని మృతదేహం కలకలం సృష్టించింది బుధవారం విపరీతమైన దుర్గంధం వెదజల్లుతూ ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కొవ్వూరు పట్టణ పోలీసులు వెల్లడించారు వివరాలు తెస్తే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.