రాజాంలో 2000 మంది ఆటో కార్మికులు గురువారం కదం తొక్కారు. తహసిల్దార్ కార్యాలయం వరుకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆటో కార్మికులకు ప్రతినెలా ఆర్థిక సహాయం అందించాలని, ఉచిత బస్సు పేరుతో కార్మికుల పొట్ట కొట్టొద్దని, PF, ESI, పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, వాహన మిత్ర 15000/- రూపాయలను 25,000/- లకు పెంచి షరతులు లేకుండా డ్రైవర్ల అందరికీ అమలు చేయాలని, ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ రామ్మూర్తి నాయుడు డిమాండ్ చేశారు.