తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా శ్రీ వెంకటరమణ ఆటో స్పేర్స్ అండ్ ఆయిల్స్ షాపు పూర్తిగా దగ్ధమైంది. వివరాల మేరకు మేరకు దగ్ధమైన షాపు యజమాని రాయపు ముని కృష్ణమ్మ షాపు షట్టర్ కు తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. ఆ షాపు నుండి దట్టమైన పొగలు వ్యాపించడంతో పక్క షాపు యజమాని అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించారు. దీనితో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న షాపు యజమాని రాయపు ముని కృష్ణమ్మ మాట్లాడుతూ తమ షాపులో సుమారు పది లక్షల రూపాయలకు పైగా విలువైన ఆటో స్పేర్స