రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో గుమ్మగట్ట మండలంలోని గోనబావి గ్రామానికి చెందిన తిమ్మప్ప అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గోనబావికి చెందిన తిమ్మప్ప మంగళవారం సాయంత్రం గ్రామంలో బైక్ పై వెళుతుండగా అదేగ్రామానికి చెందిన మరో వ్యక్తి బైక్ పై వచ్చి డీకొన్నాడు. ఈ ప్రమాదంలో తిమ్మప్ప తీవ్రంగా గాయపడగా రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి బుధవారం మద్యాహ్నం అప్పగించారు.