జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల యు-డైస్ నమోదు, విద్యార్థులు, సిబ్బంది ముఖ గుర్తింపు హాజరు నమోదు నూరు శాతం అమలు కావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో విద్యార్థులు వివరాలు యు-డైస్ లో నమోదు, ముఖ గుర్తింపు ద్వారా విద్యార్థులు, సిబ్బంది హాజరు నమోదు, అడ్మిషన్ల పురోగతి, ఉత్తమ ఫలితాల సాధన, సౌకర్యాల కల్పన వంటి అంశాలపై జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, సంక్షేమ అధికారులు, మోడల్ ఇంటర్ కళాశాలల ప్రత్యేక అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి హాజరు, ప్రతి ఉపాధ్యాయుని