శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో సోమవారం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి కావస్తున్న నేపథ్యంలో ఈ నెల 12న కదిరి పట్టణంలో విజయోత్సవ ర్యాలీను చేపట్టామని, దానిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా సాక్షి మీడియాలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ఖండిస్తూ వైఎస్ జగన్ రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.