కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విద్యాసంస్థలపై అర్థం పడటం లేని విమర్శలు చేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.