గుత్తి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్, గాంధీ సర్కిల్, రాయల్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో నూతన సీఐ రామారావు, ఎస్సై సురేష్ నేతృత్వంలో పోలీసులు మంగళవారం సాయంత్రం విస్తృతంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. ఆర్ సీ , లైసెన్సులు, హెల్మెట్ లు లేని వాహన డ్రైవర్ల పై జరిమానా విధించారు. సీఐ రామారావు మాట్లాడారు. అన్ని వాహనాల డ్రైవర్లు ఆర్ సీ, లైసెన్సులు కలిగి ఉండాలన్నారు. జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సైలు నాగ మాణిక్యం, రామాంజుల రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.