పేదల గుండెల్లో చివరి వరకు నిలిచిపోయిన నేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఎమ్మెల్సీ ఇషాక్ బాషా పేర్కొన్నారు.వైఎస్.రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం ఉదయం నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ కార్యాలయం, శ్రీనివాస సెంటర్, సాయిబాబా నగర్, చామ కాలువ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో నంద్యాల పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ మాబునిస్సా, మాజీ మార్క్‌ఫెడ్ ఛైర్మన్ పి.పి. నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.