చేపలు పట్టే వారితో కలికోట సూరమ్మ చెరువు సందడిగా మారింది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని కలికోట సూరమ్మ చెరువులో చేపల కోసం ప్రజలు ఎగబడ్డారు. ఎగువ నుంచి నీరు కలికోట సూరమ్మ చెరువులోకి విడుదల చేయడంతో స్థానికులతో పాటు పలు గ్రామాల ప్రజలు చేపలు పట్టేందుకు ఆసక్తి చూపించారు. చేపలు దొరకడంతో ప్రజలు ఆనందంగా ఇంటికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కలికోట సూరమ్మ చెరువుకు పూర్వ వైభవం వచ్చిందన్నారు...