కొరిశపాడు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో సీనియర్ నాయకులు భవానీ ప్రసాద్ రెడ్డి సారధ్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు టిడిపి నేత సత్యనారాయణ ఆదివారం తెలియజేశారు. గ్రామంలో 60 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, సైడ్ కాలువలతో పాటు ఇంటింటికి నీటిని అందించామని ఆయన పేర్కొన్నారు. నీటికి ఇబ్బంది లేకుండా వాటర్ ట్యాంక్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. రైతులు పొలాలకు వెళ్లేందుకు వీలుగా డొంక రోడ్లు వేసినట్లు సత్యనారాయణ తెలియజేశారు. పార్టీలకు అతీతంగా గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు.