మెదక్ జిల్లాలో భారీ వర్షాలు నేపథ్యంలో జిల్లా పాలన యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి మొబైల్ ద్వారా వీడియో సందేశం ద్వారా అధికారులను ఆదేశించారు. ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని తెలిపారు. మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి సూచించారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారని అవసరమైన సహాయ సహకారాలు జిల్లా అధికార యంత్రాంగం చేస్తుందని తెలిపారు. ఎలాంటి సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధం అన్నారు.