Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 25, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరులో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పావని పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలోని 15, 20వ వార్డుల్లో లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్ తో కూడిన స్మార్ట్ కార్డులను అందించారు. స్మార్ట్ రేషన్ కార్డును గుర్తింపు కార్డుగా వినియోగించుకోవచ్చని, ప్రభుత్వం ఈ కార్డులను పలు ప్రయోజనాల నిమిత్తం అందజేస్తోందని ఆమె తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 81,481 కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు.